Site icon Prime9

KTR: కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి.. కేటీఆర్

KTR

KTR

KTR: కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

అదానీతో అలయ్ ..బలయ్ (KTR)

బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు.రాహుల్ గాంధీ మోదీ, అదాని ఒక్కటే అంటున్నారు.అదానీ దోచిన డబ్బులంతా ప్రధానమంత్రికి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానీతో అలయ్  బలయ్ చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ
అవకాశవాద దిగజారుడు రాజకీయాలను చేస్తోంది.అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ జోస్యం చెప్పారు.పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ప్రతి చోట పార్టీకి బలమైన నాయకత్వం ఉంది.ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదు. సంక్షేమ కార్యక్రమాలు అందించినా చెప్పుకోవడంలో విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు. పార్టీ అన్ని స్థాయిలో కమిటీలను కొత్తగా వేసుకుంటాం.అన్ని అంశాల పైన పార్టీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేసారు.

బీజేపీ , కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ కేటీఆర్ | KTR Hot Comments On BJP , Congress | Prime9 News

Exit mobile version
Skip to toolbar