Site icon Prime9

Komati Reddy Venkat Reddy : మునుగోడు‘ కు దూరంగా.. ఆస్ట్రేలియా వెళ్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

REDDY

REDDY

Komati Reddy Venkat Reddy: మునుగోడు ఉప‌ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తర్వాతే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశముందని సన్నిహితులు చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉంటూ ఇప్పటి వరకు మునుగోడులో వెంకట్‌రెడ్డి అడుగుపెట్టలేదు. బీజేపీ తరపున వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవడంతో.. ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలోపార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొందరు టీ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి రాకపోయిన.. పార్టీకి పెద్దగా నష్టం జరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మునుగోడుకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా వెంకట్‌రెడ్డి పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. వెంకట్ రెడ్డి తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాడని ఆరోపణలు చేశారు. రాజగోపాల్ రెడ్డి గత మూడేళ్లుగా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని స్వయంగా అంగీకరించారని,వెంకట్ రెడ్డి కూడా తన సోదరుడి బాటలో నడుస్తారనే సందేహం తమకు ఉందని వారు అంటున్నారు.

Exit mobile version