Site icon Prime9

Janasena-TDP Meeting: రాజమండ్రిలో రేపు జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Janasena-TDP Meeting

Janasena-TDP Meeting

Janasena-TDP Meeting:  రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్‌లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , పి ఎ సి చైర్మెన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్, నాదెండ్లకి ఘనస్వాగతం పలికేందుకు జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయంనుంచి కాన్వాయ్‌గా సమావేశ స్ధలమైన మంజీర హోటల్‌కి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ , లోకేష్ అధ్యక్షతన ఉమ్మడి జాయింట్ యాక్షన్ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది.

ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ..(Janasena-TDP Meeting)

ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరగనున్నాయి.ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయ కార్యకలాపాలను వ్యూహరచన చేయడం, వేగవంతం చేయడం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. సెప్టెంబరు 14 న, పవన్ కళ్యాణ్ 2024లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్ లో కలిసిన అనంతరం ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

Exit mobile version