Site icon Prime9

Pawan Kalyan : తెలంగాణ సర్కారుకు జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ.. ఎందుకంటే ??

janasena chief pawan kalyan letter to telangana government

janasena chief pawan kalyan letter to telangana government

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ లేఖలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పరీక్ష ‘కీ’ విడుదల చేసినప్పుడే అభ్యంతరాలు వచ్చినా.. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలంగాణ నుంచి కొందరు అభ్యర్థులు భీమవరంలో తనని కలిసి విజ్ఞాపన అందచేశారని అన్నారు. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలు చెబుతూ.. ప్రామాణిక పుస్తకాలను కూడా ఆధారాలుగా చూపించారని, అయినా పరిగణించడం లేదని ఆ అభ్యర్థులు ఆవేదన చెందారని తెలిపారు. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశాన్ని కూడా తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.

పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు ఎంతో విలువైనదని.. తమ జీవితాలను ఆ ఒక్క మార్కు మారుస్తుందని తెలంగాణ నుంచి వచ్చిన ఆ యువకులు ఆందోళనతో చెప్పారని అన్నారు. వీరి అభ్యంతరాలను, ఆవేదనను సానుకూల దృక్పథంతో పరిశీలించి.. తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

Exit mobile version