Pawan kalyan: అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
పెద్దిరెడ్డి కుటుంబమే బాగుపడింది..(Pawan kalyan)
రాజం పేట లో వైసీపీ అన్నిరకాలుగా దోచేస్తుందని విమర్శించారు .సారా వ్యాపారం చేసే మిథున్ రెడ్డి నన్ను ఓడించడానికి ఎర్ర చందన స్మగ్లర్ లను పిఠాపురం పంపుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు .యువకులలో సలసల కాగే రక్తం ,గొలుసులను సైతం తెంచుకునే బలం ,గుండె బలం వుంది అదే బలంతో పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ,మిథున్ రెడ్డి ని కొట్టలేరా అంటూ పవన్ ఆవేశంగా మాట్లాడారు .ఇసుక దోపిడీ కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయిందని అన్నారు .కొట్టుకు పోతుందని సమాచారం వున్నా తగిన చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు .9 గ్రామాలు మునిగిపోయాయని పేర్కొన్నారు .వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు లేవని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు .ఎవరన్నాప్రభుత్వం పై మాట్లాడితే కేసు లు పెడుతున్నారని ,లేదా చంపుతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు .రాజం పేటలో ముగ్గురే బాగా బాగుపడ్డారని వాళ్ళే పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ,అయన తమ్ముడు ,అయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి లు మాత్రమే ధనవంతులయ్యాయరని పవన్ కళ్యాణ్ అన్నారు .ప్రజల బ్రతుకులు అలానే ఉన్నాయని కానీ ఈ ముగ్గురు మాత్రం బాగుపడ్డారని విమర్శించారు .పరిశ్రమలు తరలిపోతున్నాయి .ఐటీ పరిశ్రమలు అసలు రావడంలేదు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి బయటకు పంపుతున్నారని పవన్ అన్నారు .మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని .దానికి మిరే నంది పలకాలని ప్రజలను పవన్ కళ్యాణ్ కోరారు .
పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి గుంపు 10 వేల కోట్ల జి ఎస్ టీ ఎగ్గొట్టారని పవన్ పేర్కొన్నారు .ఒక పక్క రౌడీ యిజం పోతుంటే పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి మాత్రం రౌడీ యిజం తీసుకొచ్చారని పవన్ అన్నారు .ఎంతో మంది చావుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు .కూటమి ప్రభుత్వం వస్తే నే అందరికి మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు . మరో వైపు రాజం పేట బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి ని చిత్తు చిత్తు గా ఓడించాలని కోరారు .ఎన్ ఆర్ సి ,సి ఏ ఏ పై ముస్లిం లను తప్పుదోవ పట్టిస్తున్నారని వాటి వలన భారతీయ ముస్లిం లకు ఏమాత్రం ఇబ్బంది లేదని అన్నారు .టిడిపి అధినేత చంద్ర బాబు మాట్లాడుతూ రాజం పేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు .అన్నమయ్య ప్రాజెక్టు ను పూర్తిచేస్తామని చెప్పారు .ప్రాజెక్టు కట్టలేని వాడు మూడు రాజధానులు కడతామని గొప్పలు చెబుతున్నాడని జగన్ ను దుయ్య బట్టారు చంద్ర బాబు .