Site icon Prime9

Janasena chief Pawan Kalyan: ఏపీకి చీకటి రోజులు ముగిశాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan comments

Pawan Kalyan comments

Janasena chief Pawan Kalyan: ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, ఇది ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజని అన్నారు. ఈ విజయంతో వైసీపీని భవిష్యత్‌లో ఇబ్బందిపెట్టబోమని అన్నారు. ఇది కక్ష సాధింపులకు సమయం కాదన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయమని అన్నారు. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇదని చెప్పారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్..(Janasena chief Pawan Kalyan)

ఏపీలో యువత ఉపాధిలేక నలిగిపోతోందని పవన్ అన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.దేశంలో నూటికి నూరుశాతం సీట్లలో..గెలిచిన పార్టీ జనసేన మాత్రమేనని అన్నారు. ప్రస్తుత గెలుపు మామూలు గెలుపు కాదని 175 సీట్లలో గెలిచినంత బాధ్యత పెట్టారని అన్నారు. కూటమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు చాలా బలంగా ఉంటాయని తాను మాటిస్తానని చెప్పారు.వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుందని ఉద్యోగులు స్వేచ్చగా పనిచేసే వాతావరణం ఉంటుందని అన్నారు.

Exit mobile version