Jana Sena chief Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. చంద్రబాబు వయస్సుతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. చంద్రబాబు కటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి. చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్దానం జోక్యం చేసుకని విచారణ చేపట్టాలి. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.