Nadendla Manohar: ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
సెక్షన్ 144 ప్రతిపక్షానికేనా.. ? ( Nadendla Manohar)
ఒక పార్టీకి వర్తించే సెక్షన్ 144, మరో పార్టీకి ఎందుకు వర్తించదని మనోహర్ ప్రశ్నించారు. చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏ వ్యవస్థను సీఎం జగన్ గౌరవించలేదన్నారు.సమస్యల పరిష్కారం కోసం మేము పోరాడుతాం అందులో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసారు. జగన్ కోట్లాది రూపాయలను వృధా చేసారని ప్రజలు ఖచ్చితంగా జగన్ కు బుద్ది చెబుతారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం మన భవిష్యత్తు కోసమేనని వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరారు. ప్రజా తీర్పు కోసం ఎదురు చూడాలని ఆరు నెలల్లోపే జగన్ ఇంటికి పోవడం ఖాయమని మనోహర్ అన్నారు.