DL Ravindra Reddy: పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు జగన్ మోహన్ రెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నూ వైజాగ్లో, ఇప్పటంలో వేదికకు స్థలం ఇచ్చారని వేధించడం జరిగింది.చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జీవో నెంబర్ వన్ ను అడ్డుపెట్టుకొని వేధించారు.
బ్రిటిష్ పాలన లాంటి జీవో ఇది..
సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యలు పవన్ చంద్రబాబు కలయికను దగ్గర చేశాయని.. వీరిద్దరి కలయికతో సీఎం జగన్మోహన్ రెడ్డి మనుగడ పూర్తిగా సున్నా అయిపోయిందన్నారు. జీవో నెంబర్ వన్ నీచాతి నీచమైన జీవో అని ఇది 1856లో బ్రిటిష్ ప్రభుత్వంలో సిపాయిల తిరుగుబాటు తరువాత 1861 లో వచ్చిందని డిఎల్ తెలిపారు. దీనిని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే వీరిద్దరు కచ్చితంగా కలవాలనీ కోరుకున్నానని తనకు, మరే కోరిక లేదని డిఎల్(DL Ravindra Reddy) అన్నారు.
రెండురోజులక్రితం వివేకానందరెడ్డిని ఎవరో చంపారో సీఎం జగన్‌కు తెలుసు అని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా అన్ని విషయాలు చెబితే మంచిపేరు వస్తుందని, వివేకా వెంట ఉంటూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుట్రలు చేశారని మాజీ మంత్రి డీఎల్ ఆరోపించారు. వైసీపీ మంత్రులు , వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారని, జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.
మరోవైపు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డి పై మండిపడ్డారు. డి.ఎల్ రవీంద్రారెడ్డి ఒక స్థలం విషయంలో ఆయిల్ మిల్ యజమాని రామాంజనేయులు రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తే నేను కూడా ప్రమాణానికి సిద్ధమేనని సవాల్ విసిరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వయిరీ జరుగుతుందని.. త్వరలోనే నిందితుల వివరాలు వస్తాయన్నారు.డిఎల్ రవీంద్రారెడ్డి సొంత పంచాయతీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా కూడా ఆయన మనిషి గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. దమ్ము ధైర్యం ఉంటే రామాంజనేయులు రెడ్డి డబ్బు ఇవ్వలేదని ప్రమాణం చేస్తేనేను కూడా ప్రమాణానికి సిద్ధం అన్నారు.
ఇవి కూడా చదవండి:
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
MLA Vasantha Krishna Prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Mahindra Thar: తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/