Site icon Prime9

Hyderabad: ‘నీరా’కు వేదామృతం పేరు.. భగ్గుమంటున్న బ్రాహ్మణ సంఘాలు

Hyderabad Neera cafe

Hyderabad Neera cafe

Hyderabad: సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు. ఇదే తరహాలో హైదరాబాద్లో నీరాకేఫ్ కు ఏకంగా వేదామృతం అని పేరు పెట్టారు. దీనితో వెంటనే హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. వేదాలను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఎక్సైజ్ మంత్రి తనదైన శైలిలో టచింగ్ ఇచ్చారు. వేదాల్లో సురాపానం ఉందని అందువలన ఈ పేరు పెట్టడం సబబేనన్నారు. దీనికి సంబంధించి వివరాలివి.

వేదామృతం వివాదం..

హైదరాబాద్‌(Hyderabad) నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌‎కు ‘వేదామృతం’ అని పేరు.

దీనిపై బ్రాహ్మణ, హిందూ సంఘాలు ఆగ్రహం. వెంటనే పేరును మార్చాలంటూడిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవి రమణాచారికి వినతిపత్రం అందజేశారు.

ఈ వివాదంపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని అందుకే వేదామృతం పేరు పెట్టినట్లు తెలిపారు.

వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉంది. పీహెచ్‌డీ చేసిన కొంతమంది విద్యార్థులు వేదాలను అధ్యయనం చేసి వేదామృతం అనే పేరును సూచించారు.

దీనిపై అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని అన్నారు. అంతేకాదు నీరా వేరు కల్లు వేరని అన్నారు.

వేదాల్లో సురాపానం ఉందన్నారు. హైదరాబాద్‌ నీరాకేఫ్ లో సుమారుగా 500 మంది కూర్చునే విధంగా రూ.13 కోట్లతో నిర్మించారు.

పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా తాటిచెట్లు, వాటికి కుండలు కట్టారు.

పై కప్పును తాటి ఆకురూపంలో వచ్చేలా డిజైన్ చేసారు. ఇలా ఉండగా వేదామృతం పేరు మార్చితే ఊరుకోమని గౌడనేతలు అంటున్నారు.

మరి ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాలి. వేదామృతం పేరును మార్చుతారా లేదా నీరా అనే పేరునే కంటిన్యూ చేస్తారానేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్

Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి

గన్నవరం బరిలో తారకరత్న?.. లోకేశ్ మాస్టర్ స్ట్రోక్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version