CPI Narayana: రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాయకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదని అన్నారు. జగన్ లండన్ వెళ్లారని, చంద్రబాబు అమెరికా వెళ్లారని… వారిద్దరిదీ బాధ్యతా రాహిత్యమని విమర్శించారు.
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి..(CPI Narayana)
ఏపీలో అల్లర్లపై సిట్ వేయడం వల్ల ఉపయోగం లేదని, ఇటీవలి ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలపై జ్యుడిషియల్ విచారణ జరగాలని స్పష్టం చేశారు.చిత్తూర్ ,అనంతపురం ,పల్నాడు జిల్లాల్లో జరిగిన అల్లర్లు ను నారాయణ తప్పుపట్టారు .అధికార ,విపక్షం ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయని ఆరోపించారు .అల్లర్లు లో ఇద్దరిది భాద్యత ఉందన్నారు .రెండు వర్గాలు ఘర్షణలకు దిగాయన్నారు .కొన్ని చోట్ల పోలిస్ లు ప్రేక్షక పాత్ర వహించారని పేర్కొన్నారు .