Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డికి హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు.. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. ఈ నెల 25 వరకు ప్రతి రోజూ సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
హై కోర్టులో ఊరట.. (Avinash Reddy)
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డికి హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు.. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. ఈ నెల 25 వరకు ప్రతి రోజూ సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అనివాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. ఇరు వాదనల అనంతరం.. హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో.. అనినాష్ విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని తెలిపింది.
ఈ నెల 25న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దస్తగిరి వాంగ్మూలం మినహా.. ఎలాంటి ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సీబీఐ ఆరోపించిన గూగుల్ టేకవుట్ డేటాను ఆధారంగా తీసుకోకూడదని తెలిపారు.
వైఎస్ వివేకా హత్యకు.. ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే కారణమై ఉండొచ్చని కోర్టుకు విన్నవించారు.
సమీప బంధువులు కాబట్టే.. హత్య స్థలికి త్వరగా వెళ్లినట్లు నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు.
అవినాష్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని.. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు వివరించారు.
గతంలో ప్రశ్నించినపుడు.. అవినాష్ సకరించలేదని తెలిసింది. ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలులేవని తెలిపారు.