Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్‌పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్‌నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..(Hyderabad)
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనిలేనిదే బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. డిజాస్టర్, రెస్కూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.హైదరాబాద్‌లో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. మ్యాన్ హోల్స్ దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. ఆ ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.