Site icon Prime9

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మోకాళ్ళపై కొండ ఎక్కిన మహిళ.. ఎక్కడంటే ?

fan climbing hill on knees for pawan kalyan to became cm of ap

fan climbing hill on knees for pawan kalyan to became cm of ap

Pawan Kalyan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేనాని పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో అభిమానులంతా పలు విధాలుగా అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అన్న దానం, రక్త దానం, అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అలానే పలు చోట్ల పవన్ కళ్యాణ్ పేరు మీద కుల మతాలకు అతీతంగా ప్రత్యేక ప్రార్ధనలు కూడా నిర్వహించారు. కాగా పవన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయం ఓ కొండపై కొలువై ఉంది. కాగా ఆ మహిళ పవన్ కు వీరాభిమాని.. ఎంతో కష్టమైనా కూడా ఒక స్త్రీ అయి ఉండి.. పవన్ సీఎం కావాలని కోరుకుంటూ మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.

 

Exit mobile version