Site icon Prime9

Perni Nani: వ్యవస్థలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి.. చంద్రబాబుపై పేర్నినాని ఫైర్

Andhra Pradesh: వ్యవస్థలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని అని అన్నారు.

ఫేక్‌ వీడియోలను స్పష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. అశ్లీలాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకునే వ్యక్తి చంద్రబాబు. ఇంత దిగజారాల్సిన అవసరం ఏమైనా ఉందా, చంద్రబాబుకు దేవుడు అసలు సిగ్గు పెట్టినట్లు లేదు. ఎల్లో మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అమెరికా సంస్థలను కూడా దిగజారుడు రాజకీయాల్లోకి లాగుతున్నారు. అమెరికా సంస్థ ఇచ్చిందని ఫేక్‌ సర్టిఫికేట్‌ ప్రచారం చేశారని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ పై బురద చల్లేందుకు టీడీపీ నేతలు అమెరికా సంస్ద పేరుతో సర్దిఫికెట్ సృష్టంచారని పేర్ని నాని ఆరోపించారు. ఈ విధమైన ప్రచారం చేసిన వారి పై ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Exit mobile version