Site icon Prime9

CWC Meetings: ఈ నెల 16, 17, 18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC Meeting

CWC Meeting

CWC Meetings: సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.

17న విజయభేరి సభ..(CWC Meetings)

17న ఉదయం పదిన్నరకు రెండో రోజు సీడబ్ల్యూసీ సభ్యుల మీటింగ్ జరగనుంది. 17న సాయంత్రం 5 గంటలకు విజయభేరి సభ నిర్వహించనున్నారు. విజయభేరి సభలో 5 గ్యారెంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ను ప్రకటిస్తారు. అనంతరం 119 నియోజకవర్గాలకు ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బస చేయనున్నారు. సెప్టెంబర్ 18 ఉదయం కార్యకర్తలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. డోర్ టూ డోర్ 5 గ్యారంటీ స్కీమ్స్‌ను తీసుకెళ్లడం.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తల ఇళ్లలో నేతలు లంచ్ చేయనున్నారు. సాయంత్రం భారత్ జోడో మార్చ్ చేస్తారు. గాంధీ, అంబేద్కర్, కొమురం భీం విగ్రహాల దగ్గరకు ర్యాలీలు నిర్వహించనున్నారు.

Exit mobile version