CM Revanth Reddy: దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే.. 2025 లో రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని అన్నారు .
రాజ్యాంగ ప్రాధమిక సూత్రాలపై బీజేపీ దాడి..( CM Revanth Reddy)
1925లో ఆర్ఎస్ఎస్ ఓ టార్గెట్ ను పెట్టుకుందన్నారు. ఏమీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోందని చెప్పారు. కార్పొరేట్ పెట్టుబడిదారులతో మోదీ దోస్తీ కట్టాడని.. కార్పొరేట్ శక్తుల ముందు మనల్నీ కట్టుబానిసలుగా చేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ మండి పడ్డారు .సంఘ్ పరివార్ రిజర్వేషన్లను వ్యతిరేకించిందని, మండల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు . రిజర్వేషన్లు ఎత్తివేయాలనే బీజేపీ లక్ష్యం గా పెట్టుందని రేవంత్ అన్నారు .రిజర్వేషన్లు రద్దు చేయబోమని మోదీ ఎందుకు ప్రకటించడంలేదని ప్రశ్నించారు . దేశంలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రజలు కోరుకుంటున్నారని రేవంత్ తెలిపారు .రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు . ,రాజ్యాంగం రద్దు చేస్తామంటున్న మోదీపై కేసీఆర్ పోరాటం ఏది? .కేసీఆర్ ఎవరి భావాజాలం కోసం పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ ను ప్రశ్నించారు . అదే విధంగా అక్రమంగా 400 సీట్లు గెలవాలని బీజేపీ కుట్ర చేస్తోందని చెప్పారు . కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతామని ,బీసీ జనాభాను లెక్కించడం చారిత్రాత్మక అవసరమని రేవంత్ అన్నారు .27శాతం కంటే ఎక్కువ బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే.. బీసీ కులగణన జరిగి తీరాలని రేవంత్ అన్నారు .