Prime Minister Modi: ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి

ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 07:36 PM IST

Prime Minister Modi: ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.

అభివృద్ధికి సహకరించాలని..(Prime Minister Modi)

సుమారుగా గంటసేపు జరిగిన సమావేశంలో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని రేవంత్, భట్టి కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశామని తెలిపారు. విభజన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు ఐఐఎం, తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరామన్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని మోదీని కోరినట్లు వెల్లడించారు.

మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కలిసే అవకాశముంది. మంత్రి వర్గ విస్తరణ, లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశముంది. పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో నామినేటెడ్ పదవులకు పలువురు పోటీ పడుతున్నారు. వీటిపై కూడా చర్చించే అవకాశముంది.