Janasena chief Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో ఉన్న ప్రతిపక్షనాయకుడిని, ప్రజాభిమానం ఉన్న తనను వైపీసీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే సామాన్యుల పరిస్దితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షాలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అయితే వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలు చెప్పుకోవటానికి తమ దగ్గరకు..
వచ్చిన వారికి పెన్షన్లు కట్ చేశారన్నారు. వికలాంగుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ ఒత్తిడితో పోలీసులు చేతులెత్తేశారని అన్నారు. మీదనుంచి ఆదేశాలు ఉన్నపుడు తాము ఏం చేయగలమని పోలీసులు అంటున్నారని అన్నారు. అధికార పార్టీ నేతల మాటలు వినకపోతే వారికి బదిలీలు తప్పవని అన్నారు. వైసీపీ వాళ్లే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని పవన్ ఆరోపించారు. కోనసీమ జిల్లాలో 2 వేల మంది క్రిమినల్స్‌ను దింపారని, 50 మందిని చంపాలని టార్గెట్ ఇచ్చారని అన్నారు.
రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్ అని బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయ్యాడని పవన్ అన్నారు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని అన్నారు. రిచెస్ట్ సీఎం.. కానీ ఏం పనిచేశాడో తెలియదు. తాను స్వయంగా నేరస్తుడయి ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్లు పాలన చేస్తున్నారని ఇలాంటి వారికి భయపడితే భవిష్యత్తు ఉండదన్నారు. తప్పు జరుగుతున్నపుడు చూస్తూ ఊరుకోవద్దని దానిని ఎదరించాలని అన్నారు. జగన్ ఒక సైకో అని సీఎంగా ఉండటానికి అనర్హుడని అన్నారు. తాను ను బాధ్యతగల ఓ పార్టీ అధ్యక్షుడిని అని చ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని అన్నారు. మంగళగిరిలో నా పార్టీ కార్యాలయం ఉంది.నా పార్టీ ఆఫీసుకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్దితులు కొనసాగితే తాము కూడా రోడ్లపైకి వచ్చే పరిస్దితి ఉంటుందని పవన్ అన్నారు. కీలకమైన G-20 సమావేశాలను జగన్ డైవర్ట్ చేశారని ఇటువంటి సమయంలో ప్రతిపక్షనేతను అరెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని పవన్ ప్రశ్నించారు.