Minister Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు. టీడీపీ హయాంలో కేవలం 48.39 శాతం పనులు మాత్రమే జరగాయన్నారు. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారన్న దానిపై సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో జలయజ్జం పేరిట నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రజల కష్టాలు వైఎస్సార్, జగన్ స్వయంగా చూసారని అన్నారు.
ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడు..(Minister Ambati Rambabu)
చంద్రబాబు నాయుడిపైన తనకు కాస్తో కూస్తో గౌరవం వుందనే ఆయనలా వ్యక్తిగత స్దాయికి దిగజారి మాట్లాడటం లేదన్నారు. మాట్లాడితే తనను ఆంబోతు అంటాడని చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడంటూ అంబటి విరుచుకుపడ్డారు. కేవలం అదృష్టం బాగుండి ఎన్టీరామారావు అల్లుడు కావడం వలనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. తన తండ్రి, తాత ఎమ్మెల్యేలు కారని తాను స్వశక్తితో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని గతంలో అనేవారని కాని ఇపుడు అబద్దాలు ఆడితే లోకేష్ లాంటి కొడుకు పుడతారని అన్నారు.
బ్రో సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ ను సృష్టించారన్న వార్తలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ను పెట్టారని తాను విన్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ ది శునకానందం అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని అన్నారు. తాను ఆయనలా ప్యాకేజీలు తీసుకుని డ్యాన్సులు చేయనని అన్నారు. సంక్రాంతికి తాను డ్యాన్స్ చేసింది వాస్తవమేనని అన్నారు. గత ఏడాది, ఈ ఏడాది చేసానని వచ్చే ఏడాది కూడా చేస్తానని రాంబాబు పేర్కొన్నారు.