Site icon Prime9

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

kodali Nani

kodali Nani

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్‎లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బలవంతంగా తమతో రాజీనామా చేయించారని.. పార్టీ ప్రచారాలకు వాడుకున్నారని వాలంటీర్లు వాపోయారు. ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేయాలని వాలంటీర్లు వేడుకుంటున్నారు.

వాలంటీర్లతో ఫిర్యాదులు..(Kodali Nani)

టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లను విధులకు దూరంగా ఉండాలనిఆదేశించింది. ఈ సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దులు వారిని ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని భావించారు. వాలంటీర్లకు స్దానిక ప్రజల సమాచారం అంతా తెలుసనే ఉద్దేశ్యంతో వారు ఈ దిశగా ముందుకు సాగారు. ఈ మేరకు పలుచోట్ల వాలంటీర్లను రాజీనామా చేసి తమకు సాయం చేయాలని అధికారంలోకి వచ్చిన తరువాత వారికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. దీనితో ఏపీలోని పలు జిల్లాల్లో పలువురు వాలంటీర్లు వారి వత్తిడికి లొంగి రాజీనామాలు చేసారు. అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10 వేల రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. దీనితో వాలంటీర్లు తమ ఉద్యోగాలకోసం అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు. వీరిని ఎవరు వత్తిడి చేసి రాజీనామా చేయించారో వారిపై కేసు పెట్టాలని అపుడు చూద్దామంటూ కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు గుడివాడ నియోజకవర్గానికి చెందిన వాలంటీర్ల బృందం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సిపి ప్రచారం కోసం బలవంతంగా తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చిందని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు స్దానిక వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసారు.

Exit mobile version