Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు చోట్ల ఈరోజు వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సామాజిక సాధికారిత బస్సు యాత్ర”లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురం.. కోస్తాలోని తెనాలి.. రాయలసీమలోని శింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో భాగంగా 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించనున్నారు. ఎస్‌సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ నేతలు బస్సు యాత్రలో ఉంటారు.
కాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా అమలు చేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు.