Site icon Prime9

Chandrababu Naidu: కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండలు.. చంద్రబాబునాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Andhra Pradesh: విశాఖపట్నం రిషికొండ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న అర్ధ రాత్రి నుండి టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాల పై ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే మా నేతల పోరుబాట. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే టీడీపీ పోరుబాట పై ప్రభుత్వం భయపడుతుంది. ఎవరు ఎంతగా అడ్డుకున్నా ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఆగదు.

రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్‌ పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తాం అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేసారు,

Exit mobile version