Site icon Prime9

YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. జగన్ కు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెళ్లు

ys viveka

ys viveka

YS Vivekananda Reddy: ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఢిల్లీ టూర్ లో ఉన్న ఆమె మీడియాతో ఇదే విషయం మీద మాట్లాడుతూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వివేకా దారుణ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరాతిఘోరమని అన్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా కేసు విషయంలో షర్మిల గట్టిగా నిలబడి దోషులు తేలాల్సిందే అని చెప్పడం రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత – అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండ్రి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానికి స్పందించిన సుప్రీంకోర్టు – వివేకా మర్డర్‌ కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదలాయించాలని నిర్ణయించింది. ఇక సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్నారు. అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని దూరంగా ఉంటున్న షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో జరిగిన దారుణ ఘటన బాబాయ్ వివేకానంద హత్యేనని చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్లిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డిని హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా ఆయన కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించింది.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించింది. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో షర్మిల- కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సంచలనం సృష్టించాయి. ఈ దారుణ హత్య వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయని షర్మిల చెప్పడం విశేషం. అలాగే.. ఈ కేసు విషయంలో సునీతమ్మ పోరాటానికి షర్మిల పూర్తి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక షర్మిల తన వాంగ్మూలం కూడా ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ మధ్య తెలియచేసారు కూడా. కడప ఎంపీగా తనకు టికెట్‌ ఇవ్వకపోతే…షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను వివేకా కోరారని సీబీఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసింది. 2019 ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆయన సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మొదట.. వివేకానందరెడ్డిది సహజమరణమని, గుండెపోటుతో మరణించారనీ పేర్కొన్న జగన్.. ఆ తరువాత ఆయన హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఉన్నారని ఆరోపించారు. విపక్ష నేతగా వివేకా హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్ – ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు.

అయితే వివేకా కుమార్తె సునీత మాత్రం తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందే నంటూ సీబీఐ దర్యాప్తును కోరారు. ఇప్పుడు ఏపీలో హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదనీ, వేరే రాష్ట్రానికి మార్చాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. సునీత వాదనతో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించింది. కేసు విచారణ వేరే రాష్ట్రానికి మార్చాలని కోరింది. సుప్రీం కూడా అంగీకరించింది.రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా దారుణ హత్య కేసు విచారణ పుణ్యమాఅని.. ఏపీ పోలీసుల ఇమేజ్ నాశనమైందన్న మాట బలంగా వినిపిస్తోంది. సాక్ష్యులను విచారిస్తున్న సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురుకావటం.. వారు ఇచ్చిన కంప్లైంట్లను పోలీసులు కేసులుగా నమోదు చేయకపోవటం షాకింగ్ గా మారింది.సీబీఐ దర్యాప్తు అధికారిని నిందితులు బెదిరించటాన్ని సుప్రీంకోర్టును సైతం విస్మయానికి గురి చేసింది. మొత్తంగా ఏపీ పోలీసుల ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన కీలక కేసుగా వైఎస్ వివేకా హత్య ఉదంతం నిలుస్తుందన్నమాట వినిపిస్తోంది.

Exit mobile version