Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఆయన రాజీనామా చేశారు. ఇది చాలా బాధకరమైన విషయమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు ప్రతిపాదన పై మనస్థాపం చెందానన్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందన్నారు.
వైఎస్సార్ కు ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉండేదని ఆయన అన్నారు. తాను బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు హడావిడిగా వైఎస్ దగ్గరకు వెళ్లానని, “ప్రొఫెసర్ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఏమీ కాదు” అని తనతో అన్నారన్నారు. ఆయన పై ఎంత వత్తిడి వచ్చినా ఫిర్యాదు లేని కారణంగా కేసు పెట్టవద్దని నాడు వైఎస్ చెప్పారన్నారు. అలాంటి వైఎస్సార్ పేరును ఇతర వాటికి పెట్టుకోవచ్చన్నారు. కానీ వైఎస్సార్ కు ఎన్టీఆర్ అంటే అమిత ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తనను బాధించిందని, అందుకే పదవులకు రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానని, అప్పట్లో వాజ్‌పేయి చెప్తే చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. అలా జరిగితే క్రెడిట్ లక్ష్మీ పార్వతికి వస్తుందని చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని యార్లగడ్డ తెలిపారు.