Site icon Prime9

Vijayasai Reddy: 14 ఏళ్ళు ఏం చేశావ్? అమరావతి కరకట్ట పై గడ్డి పీకావా.. విజయసాయి రెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy

Andhra Pradesh: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రం అన్నయ్యా, ఇవే చివరి ఎన్నికలు అంటూ నువ్వు ఈ రోజు అస్త్ర సన్యాసం చేశావని డిబేట్లు నడుపుతున్నారు గానీ, 45 ఏళ్ళుగా నువ్వు చేసిన రాజకీయ వస్త్ర సన్యాసం గురించి ఎవరూ మాట్లాడరేమిటి అన్నయ్యా, యూ ఆర్‌ సో లక్కీ. ప్రియమైన చంద్రం అన్నయ్యా! మొదట్లోనే నిన్ను చంద్రగిరి ఛీ పొమ్మంది. ఆ తరవాత హైదరాబాద్‌ తన్ని తరిమింది. ఇంతకు ముందే ఉత్తరాంధ్ర ఉమ్మేసింది. ఇప్పుడు రాయలసీమ కూడా నిన్ను గో బ్యాక్‌ అంటోంది. అయినా సిగ్గుపడకు అన్నయ్యా, ఎల్లో కుల మీడియాలో నీకు కావాల్సినంత ప్లేస్‌ ఉంది.

చంద్రం అన్నయ్యా, నువ్వు ఇలానే తిరిగితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువై బీపీ, షుగర్ పెరిగి 2024 ఎన్నికల నాటికే పోయేలా, ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యా నువ్వు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చుంటేనే మజా. అరే చంద్రం అన్నయ్యా. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలనుకున్నావా? మరి 14 ఏళ్ళు ఏం చేశావ్? అమరావతి కరకట్ట పై గడ్డి పీకావా? బుకాయింపులు, అబద్దాలు చెప్పడంలో నిన్ను మించిన వారు లేరన్నయ్యా అంటూ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేసారు.

Exit mobile version