Site icon Prime9

Crime News : విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన.. వృద్ధురాలిని హతమార్చిన వాలంటీర్

volunteer kills old women in Visakhapatnam district

volunteer kills old women in Visakhapatnam district

Crime News : ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు. విధులు ముగించుకున్న తర్వాత ఆ రోజు కలెక్షన్ యజమాని ఇంట్లో ఇవ్వమని చెప్పడంతో… డబ్బులతో యజమాని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో యజమాని తల్లి తలుపు తీసింది. కాగా ఆమె మెడలో బంగారు గొలుసు కోసం హత్య చేసి.. పారిపోయాడు. అయితే ఈ ఘటన అంతా అక్కడ సీసీ కెమెరాల్లోని రికార్డు అయింది. స్థానికంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా సదరు వాలంటీర్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 95వ వార్డు వాలంటీర్.. వెంకటేష్ గా గుర్తించారు. నెల రోజుల క్రితమే వరలక్ష్మీ కొడుకుకు చెందిన ఫుడ్ కోర్టులో వెంకటేష్ పనిలో చేరాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో వృద్ధురాలిని వెంకటేష్ హత్య చేసి బంగారంతో ఉడాయించాడు. కొడుకు ఇంటికి వచ్చే సరికి తల్లి విగత జీవిగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా తక్కువ సమయంలోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version