New Delhi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లను నేను లేని మరో ధర్మాసనంకు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ రిజిస్ట్రీని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం, అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ల పై నేడు జరిగిన విచారణలో విముఖత చూపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇందుకు సంబంధించిన సుమారు 2వేల పేజీల ఎస్ఎల్పీని దాఖలు చేసింది. రాజధాని అంశంలో ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యం, శాసన వ్యవస్ధను నిర్వీర్యం చేయడమేనని ప్రభుత్వం పిటిషన్ లో ప్రస్తావించింది.
మరోవైపు రైతులు తమ పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాల పై స్పష్టత లేదని పేర్కొన్నారు. ప్రస్తావించిన అంశాలతో పాటు తాము పేర్కొన్న విషయాలు కూడా పొందుపరిచేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ విముఖత చూపుతూ మరో ధర్మాసనానికి బదిలీ చేయమనం గమనార్హం.
ఇది కూడా చదవండి: NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు గవర్నర్ ఆమోదం