Site icon Prime9

Pawan Kalyan: మద్దతు ఇచ్చిన నేతలకు కృతజ్నతలు…పవన్ కల్యాణ్

Thanks to the leaders who supported...Pawan Kalyan

Thanks to the leaders who supported...Pawan Kalyan

Vizag: వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారని, ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఆయన ఖండించారన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఫోన్లో సంభాషించారని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని పేర్కొన్నారు.

మద్దతుగా నిలిచిన సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్ , శ్రీ సత్య కుమార్ కు ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్సీ మాధవ్ కలిసి సంఘీభావం తెలియచేశారని తెలిపారు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా.జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను ఖండించారని తెలిపారు.

అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విశాఖలో చోటు చేసుకున్న ఘటనను, ప్రభుత్వ ధోరణిని తప్పుబట్టారని చెప్పారు. చర్యలను ఖండించి ప్రజాస్వామ్య విధానాలను సమర్థించిన ప్రతి ఒక్కరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు విశాఖలో ప్రభుత్వ పెడ ధోరణులను నిరసిస్తూ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టారని, పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న పార్టీ నేతలు, వీరమహిళలు, జన సైనికులకు ఆయన అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: వైసిపి రాజకీయ యాత్ర తుస్.. నారా లోకేష్

Exit mobile version