Site icon Prime9

Visakha CID Office: విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

CID

CID

Visakhapatnam: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుతో విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద గుమికూడారు. ఈ సందర్బంగా లోపలికి వెళ్లేందుకు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రయత్నించారు. దీనితో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తమ పార్టీ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు అరెస్ట్ ను టీడీపీ లీగల్ సెల్ ఖండించింది.

ఇంటి గోడ కూల్చివేతకేసులో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగంతో అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు.

Exit mobile version