Nara Lokesh: జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్.. నారా లోకేష్

సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 12:34 PM IST

Andhra Pradesh: సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.

జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాల‌న దుష్ఫ‌లితాలు వ‌చ్చేశాయి. నేరాలు-ఘోరాల‌లో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి సాధించ‌డంలో మీరు ఏ1 అని మ‌రోసారి నిరూపించుకున్నారు. అందులో 29 దేశ‌ ద్రోహం కేసులు నమోదు చేసి మీరు నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిచారు.

అధిక‌ ధ‌ర‌లు, అరాచ‌క‌పాల‌న‌, విధ్వంసం భ‌రించ‌లేక క‌డుపుమండి సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారంద‌రి పైనా జ‌గ‌న్ పీన‌ల్ కోడ్ వాడి దేశ‌ద్రోహం కేసులు బ‌నాయించారు. విజ‌న‌రీ చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధిలో నెంబ‌ర్ వ‌న్‌ అయితే, ప్రిజ‌న‌రీ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో నేరాల్లో నెంబ‌ర్‌వ‌న్ అయ్యింద‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గ‌ణాంకాలు వెల్ల‌డించాయి అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.