Site icon Prime9

Nandamuri Balakrishna : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర”కు టీడీపీ సంపూర్ణ మద్దతు – బాలకృష్ణ

tdp full support to pawan kalyan varahi yatra says nanadamuri balakrishna

tdp full support to pawan kalyan varahi yatra says nanadamuri balakrishna

Nandamuri Balakrishna : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల లోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ రేపటి నుంచి చేపడుతున్న వారాహి నాలుగో దశ యాత్రకు మద్ధతు ఇవ్వాలని నిర్నయించినట్లు బాలకృష్ణ చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు పవన్ వారాహి యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

తప్పు చేయనప్పుడు దేవుడికైనా భయపడాల్సిన అవసరం లేదని.. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలయ్య ఆరోపించారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని.. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసును పెట్టారని ఆయన మండిపడ్డారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని.. ఇవాళ్టీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

YouTube video player

ఇక నాలుగో విడత వారాహి విజయ యాత్రను అక్టోబర్ 1వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర సాగనుండగా.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా జరగనుంది.

 

Image

Exit mobile version
Skip to toolbar