Site icon Prime9

TDP-YSRCP: అమరావతిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అరెస్ట్

sridar

sridar

TDP-YSRCP: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాళ్లతో అమరావతి అట్టుడుకుతోంది. ఇసుక రవాణా అవినీతిపై చర్చకు రావాలని రెండు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. అమరేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో క్రోసూరు కూడలి వద్ద.. తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఉత్కంఠ.. 144 సెక్షన్ అమలు (TDP-YSRCP)

అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాళ్లతో అమరావతి అట్టుడుకుతోంది.

ఇసుక రవాణా అవినీతిపై చర్చకు రావాలని రెండు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. అమరేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని ఇద్దరు నేతలు ప్రకటించారు.

దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో క్రోసూరు కూడలి వద్ద.. తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్యే శంకరరావు శనివారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు. నేడు ఉదయం మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ ఇక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి అదుపుతప్పడంతో.. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మల్యే అరెస్టుతో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే శంకరరావు ఆలయ గాలిగోపురం వద్ద.. కొమ్మాలపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం పోలీసులు వైకాపా కార్యకర్తలను పోలీసులు అక్కడినుంచి పంపేశారు.

 

పోలీసుల హెచ్చరిక..

అమరావతిలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రేగింది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అమరావతిలో టెన్షన్ నెలకొంది.

రెండు వర్గాల మధ్య అవినీతి చర్చకు దారి తీసింది. దీంతో ఆదివారం అమరేశ్వరాలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు.

రెండు వర్గాల ఘర్షణతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ మేరకు డీఎస్పీ నారాయణ మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సవాళ్లు సహజమని.. కానీ అవి ప్రజలకు విఘాతం కలిగిస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు ఆలయానికి రావొద్దని సూచించారు. అమరావతి చుట్టూ భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

Exit mobile version
Skip to toolbar