Site icon Prime9

AP Assembly: అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Suspension of TDP members from Assembly

Suspension of TDP members from Assembly

Amaravati: వివరాల్లోకి వెళ్లితే, ఏపీ శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను నేడు కూడా స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు. మొత్తం 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిత్యావసర ధరలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరణతో పోడియంను టీడీపీ ఎమ్మెల్యే చుట్టుముట్టారు. బాదుడే బాదుడు అంటూ నినదించారు. పెరిగిన చార్జీలు, పన్నుల పై చర్చ జరగాల్సిందేనని టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

మీకు ప్రతీరోజు ఇదొక అలవాటుగా మారిందని, మీ దుష్ప్రవర్తనకు సస్పెండ్ చేస్తున్నా. వేరే వ్యాపకం లేదా అని స్పీకర్ వారిపై మండిపడ్డారు. అందరిని బయటకు తీసుకెళ్లండి అంటూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. దీంతో టీడీపీ సభ్యులు ఆగ్రహించారు. మార్షల్స్‌తో ఎలా బయటకు పంపుతారంటూ మండిపడ్డారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ ఇది నా ఆర్డర్, ముందు వారిని తీసుకెళ్లిండి అంటూ మార్షల్స్‌ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.

శాసన సభ ప్రవర్తన నియమావళి సబ్‌ రూల్‌ 2 ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చిన్నరాజప్ప, గండ్ర వెంకటరెడ్డి, జోగేశ్వరావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లను సస్పెండ్ చేసారు.

ఇక్కడ ఒక్క విషయాన్ని అధికార పార్టీ నేతలు మరిచారు. ధరలు, పన్నులు పెరగకపోతే ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు జవాబులు సులభంగానే ఇవ్వవచ్చు. అది కూడా వారికి ఉన్న సంఖ్యా బలంతో పోల్చుకుంటే ప్రతిపక్షాల సంఖ్య చాలా తక్కువే మరి. కాని సమస్యను నిలదీయడంలో ప్రతిపక్షం కీలకంగా వ్యవహరించడంతో స్పీకర్ కు చిర్రెత్తుకొచ్చిందని చెప్పవచ్చు.

ఏది ఏమైనా ఏపిలో అనాగరిక పరిస్ధితులు ఉన్నాయని ప్రజలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాలనలో మార్పులు రాకపోవడం విచారించదగ్గ విషయమే మరి.

Exit mobile version