Site icon Prime9

viveka murder case: వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

y s viveka

y s viveka

viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీం కీలక ఆదేశాలు..

వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హత్యకు గల ప్రధాన కారణాలను.. ఉద్దేశాలను బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కీలక విచారణాధికారిని మార్చండి.. లేదా ఇంకొక అధికారిని నియమించండి అంటూ సుప్రీం అసహానం వ్యక్తం చేసింది.

సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా.. రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Exit mobile version