Site icon Prime9

Shock for AP government: ఏపీ ప్రభుత్వానికి షాక్..వివేకా హత్యకేసు వేరే రాష్ట్రం బదిలీకి సుప్రీం కోర్టు ఓకే

Supreme court OK to transfer Viveka's murder case to another state

Supreme court OK to transfer Viveka's murder case to another state

YS Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనత, పోలీసులు, నిందుతులు కుమ్ముక్కైనారని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని హతుడు కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది.

దీనిపై పిటిషన్ దారుడు పేర్కొన్న విధంగా పోలీసులు, నిందితులు కుమ్ముక్కైనారని, అంశాలన్నీ నిజమేనని నిన్నటిదినం సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొనింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అనంతరం తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పును వచ్చే శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయవద్దని సీబీఐ కోరింది. కర్నాటకకు బదిలీ చేయాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిన సునీతా రెడ్డి తరుఫు న్యాయవాదులు మాత్రం, తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని తెలిపారు. విచారణ జాప్యం విషయంలో సీబీఐపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీతారెడ్డి పిటిషన్‌లో చేసిన వాదనలను న్యాయస్థానం అంగీకరించింది.

ఒక రాష్ట్రానికి సంబంధించిన సీబీఐ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసే అంశం చాలా కీలకమైంది. బాధితులకు అన్యాయం జరుగుతుందని, ప్రధాన సాక్షులను నిందితులు ప్రభావితం చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, స్థానిక అధికారులు కేసును నీరుగారుస్తున్నారన్న వాస్తవాలను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకొంటుంది. అందుకు తగ్గట్టుగా రాజకీయ ప్రభావం, నగదు లావాదేవీలు, కేసును ప్రభావితం చేయకుండా ఉండేందుకు కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇస్తుంది. సీబీఐ నేరుగా మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు వీలులేకపోవడంతో పిటిషన్ దారులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇకపై వివేకనందా రెడ్డి కేసు ధర్మాసం పేర్కొన్న మేర కేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేస్తారో, అక్కడి సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేస్తారు.

హతుడు వైఎస్ వివేకనంద రెడ్డి ఏపీ సీఎంకు సొంత బాబాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వివేకా హత్యపై పెద్ద రాద్ధాంతం చేశారు. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. అనంతరం తెదేపా నేతల పనిగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాబాయి హత్య కేసు గురించి జగన్ పెద్దగా పట్టించుకోలేదు. సరికదా నిందితులకు కొమ్ముకాస్తున్నారంటూ వివేకా కూతురు సునీతా రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. అనంతరం కూడా సీఎం జగన్ హత్య కేసును నీరుగార్చేందుకు పలు విధాలుగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సునీతా రెడ్డి తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్ధించారు. చివరకు కోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు ప్రజా సమస్యలు, రాజకీయ కక్షలుకున్యాయ వ్యవస్తలే ఏపి ప్రజలకు రక్షణ కవచంగా నిలబడుతున్నాయి. ఓ న్యాయదేవతా శరణు..శరణు.. అంటూ పలువురు కోర్టు మెట్లెక్కుతున్నారు.

ఇది కూడా చదవండి:Viveka Murder Case: సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో వివేక కుమార్తె అన్నీ నిజాలే చెప్పింది..

Exit mobile version