Site icon Prime9

Loan Apps Harassment: లోన్‌ యాప్‌ వేధింపులతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Software-engineer-commits-suicide

Tirupati: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు. కొంతకాలంగా ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఆయన ఇటీవల లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నారు. సమయానికి డబ్బులు కట్టకపోవడంతో యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయి.

వీటిని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. లోన్‌ యాప్‌ ద్వారా ఎవరూ రుణాలు తీసుకోరాదని, తనలా ఎవరు బలి కాకూడదని, తన భార్య, కుమార్తెను బాగా చూసుకోవాలంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌ పంపారు. ఆ తర్వాత కాసేపటికే దొరవారిసత్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దొరవారి సత్రం పోలీసులు ఫోన్‌ లొకేషన్‌ ద్వారా ఆచూకీ కనుక్కునేలోపు హరికృష్ణ మృతి చెందాడు.

Exit mobile version