Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ కుమార్ యత్నించినట్లు సీబీఐ ఆరోపించింది.
ఆధారాలు చెరిపివేసేందుకు యత్నం.. (Uday Kumar)
వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ కుమార్ యత్నించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు ఉదయ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు యత్నించినట్లు పేర్కొంది. హత్య అనంతరం ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ ప్రయత్నించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది.
హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ ఉదయం 4 గంటలకే ఇంటినుంచి వెళ్లాడు. ఆ రోజు మెుత్తం.. ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య తర్వాత.. ఆధారాల చెరిపివేతకు ఎదురు చూసినట్లు తెలుస్తోంది. వివేకా చనిపోయిన తర్వాత.. శివప్రకాశ్ రెడ్డి అవినాష్ కు సమాచారం ఇచ్చారు.
హత్య జరిగిన స్థలంలోనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్ ఇంట్లోనే ఉదయ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే చాలా మందిని విచారించిన సీబీఐ.. ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.