Site icon Prime9

Sajjala Ramakrishna Reddy: ఐదేళ్లు అధికారం.. ఒక్కరోజు కూడా వదులుకోం.. ముందస్తుకు వెళ్లం- సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ

Sajjla On MLc Elections

Sajjla On MLc Elections

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం లేదని.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారని తెలిపారు. అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు సమావేశం అయ్యారని వ్యాఖ్యానించారు.

కథ.. స్క్రీన్ ప్లే బాబుదే

చంద్రబాబు పర్యవేక్షణలో కథ, స్క్రీన్ ప్లే ఉంటుందని.. అవసరానికి తగ్గట్లు పాత్ర, పరిమితంగా వస్తుందని ఎద్దేవా చేశారు. అందులో భాగంగానే ప్రజా స్వామ్య పరిరక్షణ అంటూ హడావిడి మొదలు పెట్టారన్నారు. చంద్రబాబు చేసిన పనులను పవన్ ఖండించాలి కానీ ఆయన్ను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు సిద్ధాంతాలు ఏం నచ్చి మద్దతు ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.

పవన్, చంద్రబాబు .. మూడు గంటలు కూర్చొని ఏం చర్చించారో ఎందుకు బయట పెట్డడం లేదని ప్రశ్నించారు. ‘సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నారా.. ప్యాకేజ్ గురించి చర్చించారా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు కలిసి పోటీ చేస్తారనే కన్ఫ్యూజన్ త్వరగా తొలగిపోవాలన్నారు. జగన్ దింపి.. చంద్రబాబుని అధికారంలోకి కూర్చోబెట్టాలనేదే అందరి అజెండా అని తెలిపారు.

ముందస్తు పై క్లారిటీ

ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలపై సజ్జల(Sajjala Ramakrishna Reddy) క్లారిటీ ఇచ్చారు.

2024 షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఐదేళ్లు అధికారంలో ఉంటామని.. ఒక్కరోజు కూడా వదులుకోమని సజ్జల స్పష్టం చేశారు.

వెంటిలేటర్లపై ఉన్న పార్టీలే ముందస్తును కోరుకుంటున్నాయన్నారు.

జగన్ కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరని సజ్జల తెలిపారు.

ట్వీట్స్, మీడియా సమావేశాలతో దాడి

కాగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ట్వీట్స్, మీడియా సమావేశాలతో పవన్ పై దాడికి దిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ ఏపీలోని తాజా పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం వారివురు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు భేటీ అయినట్టు పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలను చూసి, వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు.

రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తుచేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని పవన్ వెల్లడించారు. విపక్షాలను అడ్డుకునేందుకు చెత్త జీవోలు తీసుకురావాడంపై పవన్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

తెలంగాణకు ఊరట.. కాళేశ్వరంపై సుప్రీం కీలక నిర్ణయం

భద్రాచలం రామాలయంలో బూజుపట్టిన లడ్డూల విక్రయాలు.. భక్తుల ఆగ్రహావేశాలు

ఓపిక లేకపోయినా వచ్చాను.. కన్నీరు పెట్టుకున్న సమంత

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version