Site icon Prime9

Ambati Rambabu: అభివృద్ది పై చర్చకు సిద్దమా? హరీష్ రావుకు అంబటి రాంబాబు సవాల్

Ambati Rambabu

Ambati Rambabu

Amaravati: తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావు, కేసీఆర్‌కు లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పై చర్చకు సిద్దమా అని హరీష్‌రావుకు సవాలు విసిరారు. హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు. హరీశ్ కి కేసీఆర్ కు తగాదాలు ఉంటే అక్కడ తేల్చుకోవాలి. మమల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావుకు, కేసీఆర్ కు లేదు. లోటు బడ్జెట్ లో ఉన్నా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు. వీటిపై మాతో హరీశ్ రావు చర్చకు సిద్ధమా? రాజకీయాల్లో వారసులు ఎవరూ ఉండరు. వారసులకి ప్రజల ముద్ర ఉండాలి. ప్రజల ముద్రతో వారసులు వస్తే తప్పేంటి? మా పార్టీ బలంగా ఉంది కనుక ఇది మంచి సమయం అని మా వాళ్లు కొందరు అనుకుంటున్నారేమో తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

పోలవరం నాశనం అయిపోవాలన్నదే చంద్రబాబు కోరిక అంటూ అంబటి మండిపడ్డారు. బినామీ పేర్లతో భూములు కొన్న అమరావతి మాత్రం వెలిగిపోవాలన్నదే చంద్రబాబు కోరిక అన్నారు. గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడూ లేదన్నారు. ఏదైనా పథకం అమలు చేస్తే కదా చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లేది అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర కాదని, ఒళ్ళు బలిసిన వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని చెప్పానన్నారు. ఇదే విషయాన్ని తాను మరోసారి చెబుతున్నానని అన్నారు. అది కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం వైసీపీ సర్కార్ చూస్తుంటే, టీడీపీ నాయకులు రైతుల ముసుగులో అడ్డుపడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్నపరిణామాలను ప్రస్తావిస్తూ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల పై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కానీ తెలంగాణలో మాత్రం టీచర్లకు 73 శాతం పిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కేంద్రం షరతుల మేరకు వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందని ఆయన విమర్శించారు.

Exit mobile version