Site icon Prime9

Bandaru Satyanarayana Murthy: ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్.. మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి

Bandaru Satyanarayanamurt

Bandaru Satyanarayanamurt

Andhra Pradesh: ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిసి సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ కృష్ణయ్య డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చిన బీసీ ద్రోహి అని అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి పీకేయమని చంద్రబాబుకి ఎప్పుడో చెప్పామన్నారు. అలాంటి ద్రోహికి జగన్ ఎంపీ పదవి ఇచ్చాడని అన్నారు.

రాష్ట్రంలో రెడ్ల హవా నడుస్తుందని, టీటీడీ బోర్డుతో సహా అన్ని పదవుల్లో వారిదే అగ్రస్థానం అని వైసిపి పై విరుచుకుపడ్డారు. మొన్నటి వరకు అందరికీ సామంత రాజుగా విజయ సాయిరెడ్డి ఉండే వారని,ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్బారెడ్డి వచ్చారని అన్నారు. వెనుకబడిన వర్గాలు అండ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఏ శక్తి ఏం చేయలేదని అన్నారు. మొట్టమొదటి సారిగా బీసీలకు గుర్తింపు తీసుకువచ్చింది ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలను ఆదరించి, గుర్తింపు తీసుకువచ్చిన పార్టీ టీడీపీ అని అన్నారు.

బిసిలను అణగదొక్కి రాజా రెడ్డి పైకి వచ్చారని, తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మనం గెలవకపోతే ఈ రెడ్డి మనల్ని రాష్ట్రంలో ఉండనివ్వడు కాబట్టి చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని బండారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొల్లి రవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కార్యకర్తులు పాల్గొన్నారు.

Exit mobile version