Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
15వ తేది మధ్యాహ్నం పవన్ వైజాగ్ చేరుకొంటారు. అదే రోజు విశాఖపట్నం అర్బన్, రూరల్ జనసేన నాయకులతో సమావేశమౌతారు. పార్టీ తీసుకోనున్న ప్రణాళికలు, అమలు అంశాలపై మాట్లాడుతారు. మరుసటి రోజు 16వ తేదీన వైజాగ్ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. అక్కడ జనసేన అధినేత స్వయంగా ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరిస్తారు.
అనంతరం సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో పవన్ సమావేశమౌతారు. 17వ తేదీన బీచ్ రోడ్డులోని వైఎంసి హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. చివరగా ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాల నేతలు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం ఉండేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
అయితే 15వ తేదీన వైకాపా నేతృత్వంలో 3 రాజధానులకు మద్ధతుగా విశాఖ గర్జన నేపధ్యంలో జనసేన అధినేత పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆ పార్టీ నేతలు, మంత్రులు పేర్కొన్నప్పటికీ పవన్ కల్యాణ్ వైజాగ్ షెడ్యూల్ ఖరారు కావడం రాజకీయంగా పెనుదుమారం లేపనుంది.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన వాయిదా వేసుకోవాలి.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు