Site icon Prime9

Pawan Kalyan Varahi Yatra : నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ ప్రారంభం.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ !

Pawan Kalyan Varahi Yatra started from today in prathipadu

Pawan Kalyan Varahi Yatra started from today in prathipadu

Pawan Kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. వారాహి యాత్ర ప్రకటించినప్పటి నుంచి వైకాపా నేతలకు .. జనసేన నాయకులకు మధ్య మాటల యుద్దం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అవన్నీ దాటుకొని పవన్ యాత్ర చేయబోతుండడం పట్ల జనసేన అభిమానులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు గత రెండు రోజులలో మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అన్నవరంలో కూడా ప్రత్యేక పూజలు జరిపించారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది.

కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్‌ పర్యటించనున్నారు. ఇప్పటికే అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది. జనసేన శ్రేణులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కటౌట్స్, జెండాలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం కన్నుల పండగలా మారిపోయింది.

వారాహి యాత్ర షెడ్యూలు..

జూన్ 14 – ప్రత్తిపాడులో వారాహి యాత్ర, కత్తిపూడిలో సభ

జూన్ 16 – పిఠాపురంలో వారాహి యాత్ర, సభ

జూన్ 18 – కాకినాడలో వారాహి యాత్ర, సభ

జూన్ 20 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ

జూన్ 21 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ

జూన్ 22 – పి.గన్నవరంలో వారాహి యాత్ర, మలికిపురంలో సభ

జూన్ 23 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ

మొదటి నుంచి పవన్ వారాహి యాత్రను అడ్డుకునేందుకు అధికార వైకాపా.. అన్నీ విధాలుగా ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. ఈ కోవలోనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నో నాటకీయ పరిణామాలను మనం గమనించవచ్చు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యే లు అంతా వారాహిని ఏపీలో రోడ్లపై తిరగనివ్వమని సవాళ్ళు విసిరినప్పటికి.. పవన్ “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ మొత్తానికి యాత్రకి సిద్దమైన తరుణంలో జనసేన అభిమానులు అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.

Exit mobile version