Site icon Prime9

PM Modi-Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ?

Pawan-Modi

Pawan-Modi

Andhra Pradesh: ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఏపీలో పరిస్థితులు, తాజా రాజకీయాల పై ఇరువురు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్‌ పాల్గొంటారా? లేదా? అనే విషయం పై ఇంకా రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ రేపటి నుంచి నాలుగు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రేపు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు పవన్‌కల్యాణ్‌ చేరుకుంటారు. రేపు విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పరిస్థితులను ప్రధానికి వివరించనున్నారు.

విశాఖపట్నం పర్యటన అనంతరం మంగళగిరి కార్యాలయంలో ఇప్పటం గ్రామం బాధితులకు చెక్కలు పంపిణీ చేస్తారు. రాష్ట్రలో రాజమండ్రి , లేదా బాపట్లలో ఓ చోట జగనన్న కాలనీల పై పవన్ సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

Exit mobile version