Site icon Prime9

Pawan Kalyan: జేపీ నడ్డాతో ముగిసిన పవన్ భేటీ.. చర్చలపై కీలక వ్యాఖ్యలు

janasena chief pawan kalyan shocking comments about politics

janasena chief pawan kalyan shocking comments about politics

Pawan Kalyan: మూడు రోజులుగా దిల్లీలో ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

పొత్తులపై కీలక సమావేశం..

మూడు రోజులుగా దిల్లీలో ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్ల వైసీపీని ఢీ కొట్టేందుకు ఎలా ముందుకు వెళ్లాలో చర్చించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు.

ఓట్లు చీలకుండా ముందుకు..

వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా.. ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జనసేనను రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అడుగులు వేస్తామని పనవ్ అన్నారు. భవిష్యత్ ప్రణాళికపై స్పష్టత వచ్చిందని.. దాని గురించి త్వరలోనే ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. భాజపా నేతలతో రెండు రోజులుగా జరిగిన చర్చలు సత్ఫాలితాలనిచ్చాయని జనసేనాని పేర్కొన్నారు. అలాగే ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

జేపీ నడ్డాతో సమావేశానికి ముందు ఇతర భాజపా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి కేంద్రం చొరవ తీసుకోవాలని పవన్ కోరారు.

పోలవరం విషయంలో ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని పవన్ ఆరోపించారు. నిర్వాసితులకు ఇప్పటికి సరైన పరిహారం అందలేదని.. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో చర్చించారు.

Exit mobile version