Site icon Prime9

Pawan Kalyan: జనసేన పార్టీ సభ్యత్వంతో 5 లక్షల బీమా, హాస్పిటల్ ఖర్చు కోసం 50 వేల ఇన్స్యూరెన్స్

janasena chieef pawan kalyan fires on ycp government

janasena chieef pawan kalyan fires on ycp government

Pawan Kalyan: క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఫోకస్ పెట్టారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ (Janasena Party) క్యాడర్ లను కోరారు.

పవన్ కళ్యాణ్. 2021-22 లో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసినందుకు కృతజ్ఘతలు తెలిపారు.

ఈ సారి కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసైనికులను ఆయన కోరారు.

 

మూడో విడతలోనూ పవన్ కళ్యాణ్ విరాళం (Pawan Kalyan)

‘ జనసేన పార్టీకి కార్యకర్తలే బలం. వారే మా సంపద.

రెండు విడతలుగా విజయవంతం అయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ మూడో విడతగా ఈ నెల 10వ తేదీ మొదలై 28 వ తేదీ వరకు సాగుతుంది.

గత రెండు విడత ల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చడం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సుమారు 6,400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం నా వంతుగా రెండు విడతల్లోనూ రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.

మూడో విడతలోనూ నా వంతుగా కార్యకర్తల బీమా కోసం ఈ నెల 10వ తేదీన విరాళం అందిస్తున్నాను.

మూడో విడత లోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని

సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి, విజయవంతం చేయాలని కోరుతున్నాను.’  అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version