Site icon Prime9

Pawan Kalyan: అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్‌ మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా డబ్బు మాత్రం కొందరి వద్దే ఉండిపోతుంది. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతమవుతాయి.

వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రధాని ముందు నోరు మెదపరు. వైసిపి ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోంది. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలి. ప్రజలు ఉపాధిలేక అల్లాడిపోతున్నారు. గుడివాడలో ఇసుక దందా నడుస్తోంది. చిత్తురు జిల్లాలో జనసేన నాయకుల పై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని. పార్టీ నడపటానికి అర్హత వైసిపికే ఉందా, మాకు లేదా, జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం”అని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Exit mobile version