Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు నాయడును స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పలు నాటకీయ పరిణామాల మద్య జరిగిన ఈ అరెస్ట్ తర్వాత.. ఆయనను ప్రత్యేక కాన్వాయ్ లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమం లోనే దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తూ కాన్వాయ్ కి అడ్డుపడుతున్నారు. కాగా చంద్రబాబును మరి కొద్దిసేపట్లో కూంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించనున్నట్లు తెలుస్తుంది.
కాగా సీత కార్యాలయంలో చంద్రబాబును విచారించిన తర్వాత వైద్య పరీక్షలు చేయించి ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ తరుణంలోనే కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి లోకేశ్ కోనసీమ జిల్లా పొదలాడ క్యాంప్ సైట్ వద్ద ఉన్నారు. లోకేశ్ తన తండ్రి వద్దకు బయల్దేరడంతో పోలీసులు అడ్డుకోగా, ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాగా చంద్రబాబును ఎక్కడికి తీసుకువస్తే అక్కడికి వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని నివాసంలో ఆయన న్యాయవాదులతో సమీక్షిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.