Andhra Pradesh: సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో వేలమందికి మంగళగిరిలో చికిత్స అందించామని తెలిపారు. టెలి మెడిసన్ ద్వారా విదేశీ వైద్యులతో సలహాలు ఇప్పించామని పేర్కొన్నారు. పేదలకు తోపుడు బండ్లు అందచేసి వారికి చయూతనిచ్చామని అన్నారు.
గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. కేటాయించిన నిధులతో అభివృద్ధి చేపట్టలేక మురిగిపోలేదా అంటూ పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ ను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. యూ1 భూమి సంగతి ఏం చేశారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.
మార్పు మొదలైంది. అసమర్థ, అవినీతి ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వందలాది వైసిపి కుటుంబాలు టిడిపిలో చేరడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. లోకేష్ రాకతో స్థానికులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొనింది.
ఇది కూడా చదవండి: Janasena Counter attack: సీఎం జగన్ పై జనసేన నేత మహేష్ తీవ్ర వ్యాఖ్యలు