Site icon Prime9

Nara Lokesh: ఇది ట్రైలర్ మాత్రమే.. 2024లో పూర్తి సినిమా- నారా లోకేశ్‌ మాస్ వార్నింగ్

yuvagalam

yuvagalam

Nara Lokesh: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని.. 2024లో పూర్తి సినిమా చూపిస్తామని హెచ్చరించారు.

నారా లోకేష్ మాస్ వార్నింగ్.. (Nara Lokesh)

ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. నాడు సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి తన వెంట్రుక కూడా పీకలేరన్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా గుండు కొట్టారు అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. లోకేష్ యువగళం పాదయాత్ర 47వ రోజు ప్రారంభమైంది.
శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం చిన్నపల్లెవాండ్లపల్లిలో ఈ యాత్ర సాగుతోంది. జోగన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన కనువిప్పు కలిగించారని లోకేష్ అన్నారు.

అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా బుద్ది చెప్పారని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వ్యతిరేక ఫలితమే వైసీపీ కి ఎదురవుతుందని వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార దాహంతో అనేక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.

ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని లోకేష్ ఘాటుగా స్పందించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమేనని.. 2024లో వైకాపాకు పూర్తి సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తుంటే సీఎం జగన్‌ కనీసం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాసెసింగ్‌ యూనిట్లేవీ?

ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలను జగన్ విస్మరించారని లోకేష్ మండిపడ్డారు.

టమోటా, వేరుసెనగ రైతుల కోసం ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లయినా వాటి ఊసే ఎత్తడం లేదని లోకేశ్‌ విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ 200 వారాలైనా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని చెప్పారు.

ఏపీ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా పరాజయంపాలైన విషయం తెలిసిందే.

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెదేపా ఘన విజయం సాధించింది.

Exit mobile version